రెండు పార్ట్ లుగా హరిహర వీరమల్లు

A M rathnam clarity on hari hara veera mallu movie second part

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే చాలావరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కొంచం పెండింగ్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాపై మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని ఈమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత ఏ ఎం రత్నం. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎం రత్నం ఈ సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈసినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని కన్ఫామ్ చేశారు.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =