గతఏడాది ధమ్కీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఈసారి మాత్రం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా గామి సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. వాటిలో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా గామి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క్ ప్రమోషన్స్ తో బీజీగా ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 29వ తేదీన ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అంతేకాదు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యొక్క పీసీఎక్స్ స్క్రీన్‌పై ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Get ready to experience the intimate saga at the Grandest Scale 🏔️❤🔥#GaamiShowreelTrailer is the 𝐅𝐈𝐑𝐒𝐓 𝐄𝐕𝐄𝐑 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 to be launched in the 𝗣𝗖𝗫 𝐅𝐎𝐑𝐌𝐀𝐓 ❤️🔥
Out on 29th Feb. Launch at PCX Screen, Prasads ✨
Grand release worldwide on March 8th 🧿… pic.twitter.com/REThseZm0f
— V celluloid (@vcelluloidsoffl) February 26, 2024
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: