ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో అలరించడానికి ప్రయత్నించే శ్రీవిష్ణు ఇప్పుడు మరోసారి అదే ప్రయోగంతో వస్తున్నాడ. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈసినిమా ఓం భీమ్ బుష్. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఈసినిమాలో ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ ను ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా మొదలుపెట్టి పూర్తిచేస్తున్నారు. రీసెంట్ గానే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అప్పటినుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: