రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల కొంచెం స్లో అయ్యాడు.ఏడాదికి అరడజనకు పైగా సినిమాలతో బిజీ గా వుండే ఈ మ్యూజిక్ డైరెక్టర్ గత 4 ,5 సంవత్సరాల నుండి సెలెక్టడ్ గా సినిమాలు ఎంచుకుంటున్నాడు.ఇక ఆడియో ఫంక్షన్ లలో దేవి చేసే హంగామా అంతా ఇంతా కాదు అయితే ఈమధ్య కాలంలో అదేం కనిపించడం లేదు అయితే ఎట్టకేలకు దేవి మళ్ళీ ఇప్పుడు జోరు పెంచాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం ఏకంగా ఏడు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.ఇందులో మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 కూడా వుంది.పుష్ప ఆడియో నేషన్ వైడ్ గా మోత మోగింది ఇక దానికి ఏమాత్రం తగ్గకుండా వుంటుందట పుష్ప 2 ఆల్బమ్.సుకుమార్ సినిమాలకు దేవి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో ఇంతకుముందే చూసాం దాంతో పుష్ప 2 ఆడియో కూడా చార్ట్ బాస్టర్ అవుతుందని ఫ్యాన్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నారు.
ఇక ఈసినిమా కాకుండా నాగ చైతన్య ,చందూ మొండేటి కాంబోలో వస్తున్న తండేల్ కు అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్,నాగార్జున కలిసి నటిస్తున్న కుబేర కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ కాగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనే సంగీతం అందిస్తున్నాడు.ఇవి కాకుండా మరో మూడు తమిళ సినిమాలకు దేవిసంగీతం అందిస్తున్నాడు అందులో సూర్య కంగువా,విశాల్ రత్నం అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: