ఓటీటీలోకి వచ్చేసిన భ్రమయుగం

Bramayugam Movie Streaming Update

రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా భ్రమయుగం. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ గా ఈసినిమాను రూపొందించారు. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వంతో తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సోని లివ్ వారు సొంతం చేసుకోగా మార్చి 15 న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక చెప్పినట్టే ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేటి నుండి ఈసినిమా మలయాళం తో పాటు తెలుగు, తమిళ్ లో కూడా అందుబాటులోకి రానుంది.

కాగా ఈసినిమాలో ఇంకా అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నైట్ షిఫ్ట్ స్డూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, సంగీతం క్రిష్టో జేవియర్, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు రిలీజ్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.