మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది.గత వారం గామి,భీమాలతో పాటు విడుదలై ఇప్పుడు ఆ రెండింటికంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది.మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.బుక్ మై షోలో మిగితా రెండు సినిమాలకంటే ఎక్కువ టికెట్లు ప్రేమలుకే తెగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో డైలాగ్స్ అలాగే క్యాస్టింగ్,మ్యూజిక్ హైలైట్ అయ్యాయి.వీటికి తోడు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు.తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదలచేశాడు.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా దాటేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్ లో 10కోట్ల వరకు రాబట్టుకోనుంది.
ఇక మలయాళంలో ప్రేమలు ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.ఆల్రెడీ 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయగా ఫుల్ రన్ లో మరో 10కోట్ల వరకు రాబట్టుకోనుంది.మమితా బైజు,నస్లేన్,సంగీత్ ప్రతాప్,అఖిల బార్గవన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను గిరీష్ ఎడి డైరెక్ట్ చేశాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























