టైగర్ తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్-డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన.గత నెలలో మంచి అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం ఆ అంచనాలను అందుకొని హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా విడుదలై నిన్నటికి 25రోజులు పూర్తి చేసుకోవడంతో ఎంత కలెక్ట్ చేసిందో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 30కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు.ముఖ్యంగా సాంగ్స్,సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి.సినిమా విడుదలకు ముందే సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడంతో హైప్ పెరిగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక భైరవకోనతో సందీప్ కిషన్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు.ఈసినిమాఫై సందీప్ ముందు నుండి కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఈసినిమా ఓటిటి లోకి కూడా వచ్చేసింది.గత వారమే అమెజాన్ ప్రైమ్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తెచ్చింది.సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాలో వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్ హీరోయిన్లు నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈసినిమాను నిర్మించాడు.
ఇక తన తదుపరి సినిమాను కూడా ఇదే బ్యానర్ లో చేయనున్నాడు సందీప్ కిషన్.ధమాకా ఫేమ్ త్రినాథ రావు నక్కిన ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ,మాటలు అందివ్వనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























