హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గుప్త నిధుల కోసం ముగ్గురు స్టూడెంట్స్ చేసిన అన్వేషణను ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు శ్రీహర్ష ఇప్పటికే తెలిపారు. ఈసినిమా మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆద్యంతం హిలేరియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
కాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తున్న ఈసినిమాను వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: