జపాన్ లో ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్

RRR movie craze in japan

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా జపాన్ లో మాత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. 2022 అక్టోబ‌ర్ 21న ఈ మూవీ జ‌పాన్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌యింది. అయితే అక్కడ రిలీజ్ అయిన దగ్గరనుండీ కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక జపాన్‌లో ఈసినిమా రిలీజై ఏడాదిన్న‌ర దాటినా అక్క‌డ ఈ మూవీ క్రేజ్ ఇప్ప‌టికీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ అక్కడి సినిమా థియేట‌ర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు ద‌ర్శ‌నమిస్తున్నాయి. అంతేకాదు జపాన్ లో మార్చి 18న సినిమాను చూడటానికి రాజ‌మౌళి అక్కడకు వెళుతున్నట్టు తెలుస్తుంది.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + ten =