పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎలక్షన్స్ టైమ్ దగ్గరపడుతుండటంతో సినిమాలను సైతం పక్కనపెట్టి ఎప్పటినుండో పవన్ పూర్తిగా తన ఫోకస్ ను రాజకీయాలపై పెట్టాడు. ఇప్పటికే తను పోటీ చేస్తున్న నియోజకవర్గం గురించి క్లారిటీ కూడా ఇచ్చాడు. తాజాగా పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పవన్ పోటీ చేయనున్నట్టు తెలిపాడు. అంతేకాదు అదే సమయంలో తన పొలిటికల్ జర్నీ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర డబ్బులు లేక పార్టీని ఎలా నడపాలో అని భావిస్తున్న సమయంలో నా స్నేహితుడు త్రివిక్రమ్ వెన్నంటే ఉన్నారని.. నేను ప్రజల గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ నా గురించి ఆలోచించేవాడు. నాకు సినిమాలు తెచ్చిపెట్టేవాడు.. నేను రాజకీయాల్లోకి రావడం తనకి అస్సలు ఇష్టంలేదు..నన్ను ఎలాగైనా మార్చాలని జల్సా సినిమాలో కొన్ని డైలాగ్స్ రాశాడు..ఇంటర్వెల్ బ్యాంగ్ లోని డైలాగ్స్ ను రాసి ఇస్తే నేను ఆగిపోతానేమో అని త్రివిక్రమ్ అనుకున్నాడని కానీ నేను అక్కడినుంచి పేట్రేగిపోయానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పవన్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. క్రిష్ దర్శకత్వంలో రానున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. వీటితో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఎలక్షన్స్ అయిపోయిన తరువాత మళ్లీ పవన్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటారని తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: