విష్ణు మంచు నుండి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఎక్కువ షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరుపుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఇటీవలే చిత్రయూనిట్ ఈ విషయాన్ని తెలియచేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. ఈసినిమా షూట్ లో పాల్గొనేందుకు గాను అక్షయ్ కుమార్ హైద్రాాాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈనేపథ్యంలో మోహన్‌బాబు, మంచు విష్ణు అక్షయ్‌కుమార్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: