తండేల్ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్

naga chaitanya thandel movie shooting latest update

నాగ‌చైత‌న్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా షూటింగ్ కొద్ది రోజులుగా బీహెచ్‌ఈఎల్‌లో ఏర్పాటు చేసిన జైలులో జరిగిందట. అంతేకాదు తరువాత షెడ్యూల్ మే 2 న ప్రారంభమై మే 18 వరకు కొనసాగుతుందని అంటున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − one =