యాక్షన్ హీరో విశాల్ నుండి రాబోతున్న సినిమా రత్నం. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Rathnam censored with a UA.
Get set for a speedy action entertainer in theatres from April 26th.Tamil Trailer – https://t.co/ICmgSPHpX7
Starring Puratchi Thalapathy @VishalKOfficial.
A film by #Hari.
A @ThisisDSP musical. @stonebenchers @ZeeStudiosSouth @priya_Bshankar… pic.twitter.com/cS5MNy1rEs— Stone Bench (@stonebenchers) April 17, 2024
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా…సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను జీ స్టూడియోస్ ఇంకా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: