విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గామి. మొదటిసారి విశ్వక్ కెరీర్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది ఈసినిమా. ఈసినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈసినిమా హక్కులను సొంతంచేసుకోగా ఏప్రిల్ 12వ తేదీ నుండి ఈసినిమా ప్రస్తుతం స్టీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన కేవలం 72 గంటల్లోపే ఈసినిమా 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకుంది. త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది.
Breaking records faster than the snow melts in summer! ❄️
50 million views in 72 hours for Gaami. ⚡ Streaming now on ZEE5 in Telugu Kannada Tamil in 4K@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya #NareshKumaran @_Vishwanath9 @Synccinema @vcelluloidsoffl… pic.twitter.com/e4FjODWXSz
— V celluloid (@vcelluloidsoffl) April 16, 2024
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, హారిక,మహమ్మద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వి సెల్యూలాయిడ్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్ సంగీతం అందించిన ఈసినిమాకు..విశ్వనాథ్ రెడ్డి చెలుమళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: