ఆ వార్తల్లో నిజం లేదు – నాగవంశీ 

naga vamsi respond on devara Theatrical rights rumours

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో దేవర థియేట్రికల్ రైట్స్ గురించి  చర్చ జరుగుతుంది.ఈసినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ 120కోట్లకు దక్కించుకుందని వార్తలు వచ్చాయి.కొందరు అయితే ఏకంగా పోస్టర్ ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు.ఇక ఈ న్యూస్,పోస్టర్ లు సితార అధినేత నాగవంశీ కంటపడడంతో తాజాగా అయన క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రొడక్షన్ గురించి డిస్ట్రిబ్యూషన్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే ఆ విషయాన్ని మేమే అధికారికంగా ప్రకటిస్తామని నాగవంశీ ట్వీట్ చేశాడు.అయితే నాగవంశీ ట్వీట్ లో మాత్రం దేవర పేరును ఎక్కడా మెన్షన్ చేయలేదు.ఇక రీసెంట్ గా సితార డిస్ట్రిబ్యూషన్ లోకి  కూడా ఎంట్రీ ఇచ్చింది.గత ఏడాది లియో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయగా ఆ సినిమాతో మంచి లాభాలు అందుకుంది.

ఇదిలావుంటే దేవర రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారని సమాచారం.సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో దేవర నిర్మాతలు భారీగా కోట్ చేస్తున్నారట.మరి ఈ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. సాంగ్స్ పై  ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =