
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 105


మహారాజ 4 డేస్ కలెక్షన్స్

ఇండియన్ 2రిలీజ్ పై మరోసారి క్లారిటీ

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్

నార్త్ అమెరికాలో కల్కి సంచలనం

హరిహర వీరమల్లు షూటింగ్ రీస్టార్ట్ అప్ డేట్

అఫీషియల్.. పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది

ఓజీ నుండి థమన్ బ్లాస్టింగ్ మ్యూజికల్ అప్ డేట్

రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

విశ్వక్ సేన్ గ్రేట్ డెసిషన్, సర్వత్రా ప్రశంసలు

దేవర-గోవా ఫారెస్ట్ లో యాక్షన్ షెడ్యూల్ పూర్తి

ఫాదర్స్ డే స్పెషల్.. మహేష్‌తో సితార, పిక్ వైరల్

ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చరణ్, పిక్ వైరల్

ఆకట్టుకుంటోన్న డార్లింగ్ ఫస్ట్ సింగిల్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.

కాలినడకన తిరుమల కొండపైకి త్రివిక్రమ్ శ్రీనివాస్
టాలీవుడ్ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దైవభక్తి ఎక్కువ. పురాణాలు, ఇతిహాసాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇది ఆయన రచయితగా పనిచేసిన, అలాగే దర్శకత్వం వహించిన చిత్రాలలో మనకు అర్ధమవుతుంది. పురాణాలు, ఇతిహాసాలు రిఫెరెన్స్‌గా సినిమాలోని ఎదో ఒక పాత్రతో సందర్భానుసారం కొన్ని డైలాగ్స్ చెప్పిస్తుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా ఆయన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

కల్కి ప్రమోషన్స్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసిన నాగ్ అశ్విన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

మహారాజ 4 డేస్ కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

ఇండియన్ 2రిలీజ్ పై మరోసారి క్లారిటీ
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భారతీయుడు2. ఈసినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా మొదలైన తరువాత ఎన్ని సమస్యలు వచ్చాయో తెలిసిందే. మధ్యలో ఈ మూవీని ఆపేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ స్టార్ట్ చేశారు. ఎలాగోలా షూటింగ్ ను పూర్తిచేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్
రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక ఈమధ్య హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా వస్తున్న సినిమా శివం భజే. ఈసినిమా టైటిల్ ను ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఆతరువాత అయితే ఎలాంటి అప్ డేట్ రాలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

నార్త్ అమెరికాలో కల్కి సంచలనం
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా ఈసినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా ప్రీ సెల్స్ ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. జూన్ 26 వ తేదీన ప్రీమియర్ షోలతో సినిమా స్టార్ట్ కానుంది. ఈనేపథ్యంలోనే నార్త్ అమెరికాలో ఈసినిమా కొత్త రికార్జులు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ తోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది…

హరిహర వీరమల్లు షూటింగ్ రీస్టార్ట్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో మొగలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా చాలా వరకూ షూటింగి ను పూర్తి చేసుకుంది. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ పెండింగ్ లో పడిపోయింది.

అఫీషియల్.. పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

లక్కీ భాస్కర్- మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి ఫోలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ మొదటి సినిమాతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఈసినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు డైరెక్టర్ గా తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా లక్కీ భాస్కర్.

ఓజీ నుండి థమన్ బ్లాస్టింగ్ మ్యూజికల్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఓజీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఈ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న మహారాజ
కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఇక విడుదలకు ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ సహా ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహా రాజా రవితేజ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిజానికి రవితేజ కు సాలిడ్ హిట్ దక్కి చాలా రోజులైపోయింది. ధమాకా తరువాత ఇంతవరకూ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

విశ్వక్ సేన్ గ్రేట్ డెసిషన్, సర్వత్రా ప్రశంసలు
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలావుండగా.. విశ్వక్ సేన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా ఆయన 'మెట్రో రెట్రో' అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవదానం (ఆర్గాన్ డొనేషన్)కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దేవర-గోవా ఫారెస్ట్ లో యాక్షన్ షెడ్యూల్ పూర్తి
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లో మార్పు వచ్చింది. ముందుగానే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చారు.

పవన్ కల్యాణ్‌కు స్పెషల్ గిఫ్ట్ అందించిన సాయి ధరమ్ తేజ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే నియమించబడిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పదవితోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పోటీ చేసిన (21) అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రకు మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

కల్కి-భైరవ యాంథమ్ ఫుల్ సాంగ్ రిలీజ్
త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నాగా ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు కల్కి అప్డేట్స్ రివీల్ చేస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ…

ఫాదర్స్ డే స్పెషల్.. మహేష్‌తో సితార, పిక్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ జెనరేషన్‌లో పక్కా ఫ్యామిలీ హీరో అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. సతీమణి నమ్రతా శిరోద్కర్, తనయుడు గౌతమ్ మరియు కుమార్తె సితారలతో ఆయన హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు. తనయుడు గౌతమ్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇక ముద్దుల తనయ సితారతో మహేష్‌కు ప్రత్యేక అనుబంధం. ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ సితార తోటివారితో ప్రేమపూర్వకంగా మెలగడంలోనూ, సమాజసేవ చేయడంలోనూ ముందుంటూ చిన్న వయస్సులోనే తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది.

డబల్ ఇస్మార్ట్ పాటల చిత్రీకరణలో బిజీ
టాలీవుడ్ యంగ్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈసినిమాలో రామ్ మరింత మాస్ తో రాబోతున్నట్టు టీజర్ ను చూస్తే అర్థమైంది.

ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చరణ్, పిక్ వైరల్
ఫాదర్స్ డే సందర్భంగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గారాల పట్టి క్లీంకారతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముద్దుల తనయ క్లీంకారను ఎత్తుకుని గాల్లోకి ఎగరేస్తూ ఆడిస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కాగా రామ్ చరణ్, క్లీంకార ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరీతంగా షేర్స్ చేస్తూ లైక్స్ కొడుతూ తమ పేవరెట్ హీరోపై ఓ రేంజ్‌లో అభిమానం చూపిస్తున్నారు.