ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లో మార్పు వచ్చింది. ముందుగానే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఈసినిమా గోవాలో షూట్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా షూట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చాడు సినిమాటోగ్రాపర్ రత్నవేలు. గోవా ఫారెస్ట్ లో భారీ వర్షం, వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించాం అంటూ తెలిపారు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























