పవన్ కల్యాణ్‌కు స్పెషల్ గిఫ్ట్ అందించిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej Gives Special Gift To AP Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే నియమించబడిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పదవితోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పోటీ చేసిన (21) అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రకు మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖ జాతీయ నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలు పవన్‌ని ఆశీర్వదించి మోంట్‌బ్లాంక్ పెన్‌ని బహుమతిగా అందజేశారు. ఈ క్రమంలో పవన్ మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తమ చిన మావయ్యకు ఒక ప్రత్యేక గిఫ్ట్ అందించాడు.

పవన్ కళ్యాణ్ విజయం సాధించిన నేపథ్యంలో ఇటీవలే సాయి ధరమ్ తేజ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పవన్ ఇంటికి వెళ్లిన తేజ్.. మావయ్యకు ఓ స్పెషల్ గిఫ్ట్ బహూకరించాడు. ఇంతకీ అతడు ఏమిచ్చాడో తెలుసా? స్టార్ వార్స్ గేమ్ సెట్. ఇది పవన్ ఫేవరెట్ గేమ్ అని, అసలు తనకు స్టార్ వార్స్ పరిచయం చేసిందే తన మావయ్య అని సాయి ధరమ్ తెలిపాడు. ఈ సందర్భంగా పవన్‌కు తాను గిఫ్ట్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.