విశ్వక్ సేన్ గ్రేట్ డెసిషన్, సర్వత్రా ప్రశంసలు

Vishwak Sen Promises To Donate His Organs

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలావుండగా.. విశ్వక్ సేన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా ఆయన ‘మెట్రో రెట్రో’ అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవదానం (ఆర్గాన్ డొనేషన్)కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన‌ ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన విశ్వక్ సేన్.. “ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడినవారమవుతాం” అని పిలుపునిచ్చారు. కాగా ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ అద్భుతమైన నిర్ణయం తీసుకున్న విశ్వక్ సేన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారని అందరూ కొనియాడుతున్నారు. విశ్వక్‌తో గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తీసిన దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా విశ్వక్ సేన్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’ త్వ‌ర‌లోనే విడుదలకు సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.