త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నాగా ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు కల్కి అప్డేట్స్ రివీల్ చేస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ రేంజ్ లో నిర్వహించేందుకు మూవీ టీం రెడీ అవుతున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి భైరవ యాంథమ్ సాంగ్ వీడియోకు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చారు. ఈయాంథమ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. దిల్జిత్ సింగ్ ఈపాటను పాడగా ప్రోమోకు మంచి సినిమా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























