టాలీవుడ్ యంగ్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈసినిమాలో రామ్ మరింత మాస్ తో రాబోతున్నట్టు టీజర్ ను చూస్తే అర్థమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. కేవలం మూడు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉండగా.. ప్రస్తుతం హైదరాబాద్లో పాటల చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రెండు రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఆగష్ట్ 15వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ డేట్ ను ముందే ఫిక్స్ చేసుకుంది. అలాంటిది ఆ డేట్ లోకి డబులు ఇస్మార్ట్ వచ్చేసింది. దీంతో పుష్ప 2 రిలీజ్ పడే అవకాశం ఉందన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
కాగా ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























