కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 104

nag ashwin released episode 2 of kalki 2898 ad journey
సినిమా వార్తలు

కల్కి మూడో ప్రపంచం పరిచయం

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎదురుచూపులకు మరికొద్ది రోజుల్లో బ్రేక్ పడనుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఫ్యాన్స్ ఒక వైపు అప్ డేట్లు లేవని బాధపడుతున్న సమయంలో ఇప్పుడు వరుసగా అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Upasana Konidela Shares Emotional Video on Her Daughter Klin Kaara's First Birthday
సినిమా వార్తలు

క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన ఉపాసన

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు జరుగుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, ఉపాసనల గారాలపట్టి క్లిన్ కారా కొణిదెల జన్మించి నేటికి ఏడాది అవుతోంది. మెగా ప్రిన్సెస్ తొలి పుట్టినరోజు సందర్భంగా గురువారం వారి ఇంట సందడి నెలకొంది. కాగా ఆ చిన్నారి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్లిన్ కారాకు బర్త్ డే విషెస్‌ చెబుతూ తల్లి ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు.

Srikanth Mవాట్సాప్
varun tej gives matka movie shooting update
షూటింగ్ అప్‌డేట్

మట్కా-బ్యాక్ టు సెట్స్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Welcomes AP Cinematography Minister Kandula Durgesh on Vishwambhara Sets
సినిమా వార్తలు

విశ్వంభర సెట్స్‌లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం నూతనంగా కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు పలువురు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా నియమితులయ్యారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌కు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి పదవి దక్కింది. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Pre Release Event Held in A Grand Manner at Mumbai
సినిమా వార్తలు

కల్కి 2898 AD.. ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణే, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్‍తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
vijay sethupathi interesting comments on rc rc16 movie
సినిమా వార్తలు

RC 16 సూపర్ హిట్ పక్కా- విజయ్ సేతుపతి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా లైన్ లో ఉంది.ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు.

TFN Adminవాట్సాప్
naveen chandra eleven teaser out now
ట్రైలర్ & టీజర్

నవీన్ చంద్ర లెవన్ టీజర్ రిలీజ్

అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తన పాత్రల ద్వారా ఎలాంటి పాత్ర అయినా చేయగలడు అనే పేరును సైతం తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు అలానే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.. వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ ఏ అవకాశం వస్తే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే మంత్ ఆఫ్ మధు అనే వెబ్ సిరీస్ తో దాదా సాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఉత్తమ నటుడిగా కూడా అవార్డును సొంతం చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
kalki 2898 AD Censor formalities completed
సినిమా వార్తలు

కల్కి సెన్సార్ కంప్లీట్

ప్రభాస్ కల్కి 2898 ఏడి మరో 8రోజుల్లో థియేటర్లోకి రానుంది.ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈసినిమా.ఇక ఈసినిమాకు సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.దాదాపు 3గంటల రన్ టైంతో రానుంది.సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట. విజువల్స్ అదిరిపోయాయని ఎంటర్టైన్మెంట్,ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిపి సినిమా ఉందట.ఇలా రిలీజ్ కు ముందే పాజిటివ్ రివ్యూస్ రావడం తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
sakshi vaidya first look out from sharwa 37
ఫస్ట్ లుక్

శర్వా 37నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

రీసెంట్‌గా మనమేతో వచ్చి డీసెంట్ హిట్ కొట్టాడు హీరో శర్వానంద్. ఇప్పటికీ ఈ సినిమా పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత శర్వా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో 37వ సినిమా ఒకటి. సామజవరగమనతో బ్లాక్ బాస్టర్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ ను పరిచయం చేశారు.

Srikanth Mవాట్సాప్
RC 16 shoot starts from august
షూటింగ్ అప్‌డేట్

ఆర్ సి 16 షూటింగ్ అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చెప్పేశాడు ఆ సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సనా.రీసెంట్ గానే ఈసినిమా లాంచ్ అయ్యింది.రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.ఫ్యాన్స్ అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలు కానుందని బుచ్చి బాబు రివీల్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
navdeep love mouli movie ott partner locked
ఓటీటీ

లవ్ మౌళి ఓటీటీ పార్టనర్ లాక్

ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజులకే ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తున్నా కొన్ని సినిమాలు అయితే మాత్రం రిలీజ్ అయిన పది రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చేసింది నవదీప్ లవ్ మౌళి సినిమా. అవ‌నీంద్ర ద‌ర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan’s SK30 Shooting Begins in Hyderabad Today
షూటింగ్ అప్‌డేట్

సందీప్ కిషన్ SK30 షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశారు. కాగా ఇది సందీప్ కిషన్‌కు ల్యాండ్‌మార్క్ (30వ) చిత్రం కావడం విశేషం. వర్కింగ్ టైటిల్ #SK30గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు 'ధమాకా' ఫేమ్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇందులో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండనుంది.

Srikanth Mవాట్సాప్
ashwin babu shivam bhaje movie first glimpse out now
ట్రైలర్ & టీజర్

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శివం భజే. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించుకుంది. ఇక ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya and Sai Pallavi Arrives Srikakulam For Thandel Shooting
షూటింగ్ అప్‌డేట్

తండేల్‌ షూటింగ్.. శ్రీకాకుళంలో సందడి చేసిన నాగచైతన్య, సాయిపల్లవి

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ కానున్న చిత్రాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న తండేల్‌కు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
pawan kalyan takes charge as deputy chief minister
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా. తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం గా గౌరవం దక్కడంతో పాటు నాలుగు శాఖలను కూడా పవన్ కు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.

TFN Adminవాట్సాప్
Salman Khan-AR Murugadoss Combo Movie Sikandar Shoot Begins
సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్-మురుగదాస్ కాంబోలో 'సికందర్' ప్రారంభం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'సికందర్'. కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనుండటం విశేషం. కాగా గతంలో మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ చిత్రం రమణ (తెలుగులో ఠాగూర్)ను సల్మాన్ ఖాన్ హిందీలో 'జై హో' పేరుతో తీసి విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
senior actress shobana first look out from kalki 2898 ad movie
ఫస్ట్ లుక్

కల్కి2898AD నుండి శోభన ఫస్ట్ లుక్ రిలీజ్

త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్, స్పెషల్ వీడియోస్ ఎన్నో రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
lucky baskhar movie first single out now
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్- మెలోడియస్ శ్రీమతి గారు ఫస్ట్ సింగిల్ రిలీజ్

మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. . ప్రస్తుతం అయితే మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ బాగానే ఆకట్టుకుంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Ram Pothineni, Srinu Vaitla Block Buster Movie Ready Completes 16 Years
సినిమా వార్తలు

16 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'రెడీ'

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే ఏవో కొన్ని చిత్రాలు మాత్రమే హిట్ అవుతుంటాయి. వాటిలో కూడా ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకునేలా ఉండేవాటిని వేళ్ళపై లెక్కించొచ్చు. కానీ ఏళ్ళు గడుస్తున్నా గుర్తుండేవి మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటివాటిలో ఒకటే 'రెడీ' సినిమా. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వస్తున్నా చూడటానికి అమితాసక్తి కనబరుస్తుంటారు ఆడియెన్స్. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సీన్స్, డైలాగ్స్ నేడు మీమ్స్ రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటాయి. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్ళు అవుతోంది.

Srikanth Mవాట్సాప్
harish shankar musical update on ravi tejas mr bachchan movie
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్- హరీష్ శంకర్ మ్యూజికల్ అప్ డేట్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు రవితేజ. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి షోరీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్

షేర్