మాస్ మహా రాజా రవితేజ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిజానికి రవితేజ కు సాలిడ్ హిట్ దక్కి చాలా రోజులైపోయింది. ధమాకా తరువాత ఇంతవరకూ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాఉండగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు సంబంధించిన అప్డేట్ ను ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా నుంచి షో రీల్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో మొత్తం డైలాగ్స్ లేకుండా ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా సాగింది. రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
కాగా హరీష్ శంకర్ ,రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చాయి.ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ‘మిస్టర్ బచ్చన్ ‘మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. మరి ఈసినిమా అయినా రవితేజ కు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందేమో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























