ఫాదర్స్ డే స్పెషల్.. మహేష్‌తో సితార, పిక్ వైరల్

Sitara Ghattamaneni Shares Cute Pic With Father Mahesh Babu on Father's Day

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ జెనరేషన్‌లో పక్కా ఫ్యామిలీ హీరో అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు. సతీమణి నమ్రతా శిరోద్కర్, తనయుడు గౌతమ్ మరియు కుమార్తె సితారలతో ఆయన హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు. తనయుడు గౌతమ్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇక ముద్దుల తనయ సితారతో మహేష్‌కు ప్రత్యేక అనుబంధం. ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ సితార తోటివారితో ప్రేమపూర్వకంగా మెలగడంలోనూ, సమాజసేవ చేయడంలోనూ ముందుంటూ చిన్న వయస్సులోనే తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇది సితారకు తన తాత, దివంగత లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరియు తండ్రి మహేష్ బాబు నుంచి వచ్చిన గొప్ప లక్షణం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో తండ్రి మహేష్‌తో కలిసి పలు షోలలో పాల్గొంటూ మీడియాలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో సితార చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న అకేషన్‌ని తండ్రి అభిమానులతో షేర్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటుంది.

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

కాగా మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తన తండ్రితో సంతోషంగా ఉన్న ఫోటో ఒకటి ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఫాదర్స్ డే సందర్భంగా సితార తండ్రి మ‌హేష్ ఒళ్ళో పడుకొని సరదాగా అల్లరి చేస్తున్న ఫోటోలను సితార పోస్ట్ చేసింది. దీనికి ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.. నువ్వు నా సూపర్ హీరో’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.