విశ్వంభర సెట్స్‌లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి

Megastar Chiranjeevi Welcomes AP Cinematography Minister Kandula Durgesh on Vishwambhara Sets

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం నూతనంగా కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు పలువురు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా నియమితులయ్యారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌కు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి పదవి దక్కింది. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరంజీవి తాజాగా మంత్రి కందుల దుర్గేష్‌ను ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆహ్వానించారు. ఆయన కోరిక మన్నించి విచ్చేసిన మంత్రికి మెగాస్టార్‌ ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఇక మంత్రిగా తన బాధ్యతలని నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్థి చేస్తారని విశ్వసిస్తున్నానని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇక ఈ సందర్భంగా కాగా చిరంజీవి ప్రస్తావించిన అంశాలపై దృష్టి సారిస్తానని, తెలుగు చలన చిత్ర అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ హామీ ఇచ్చారు. కాగా మంత్రి దుర్గేష్‌ చిరంజీవికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.