క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన ఉపాసన

Upasana Konidela Shares Emotional Video on Her Daughter Klin Kaara's First Birthday

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు జరుగుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, ఉపాసనల గారాలపట్టి క్లిన్ కారా కొణిదెల జన్మించి నేటికి ఏడాది అవుతోంది. మెగా ప్రిన్సెస్ తొలి పుట్టినరోజు సందర్భంగా గురువారం వారి ఇంట సందడి నెలకొంది. కాగా ఆ చిన్నారి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్లిన్ కారాకు బర్త్ డే విషెస్‌ చెబుతూ తల్లి ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మై డియర్ క్లిన్ కారా జన్మదిన శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా జీవితాల్లో ఆనందం నింపినందుకు థ్యాంక్యూ. ఈ వీడియోను ఇప్పటికి మిలియన్ టైమ్స్ చూశాను” అని పేర్కొన్నారు. అయితే విశేషమేమంటే ఈ వీడియో పాతదే. గతేడాది ఉపాసన పుట్టినరోజున రాం చరణ్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇప్పుడు ఇదే వీడియోను ఉపాసన మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్ట్టింట వైరల్‌ అవుతోంది.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

కాగా ఆ వీడియోలో చరణ్‌, ఉపాసనతోపాటు వారి కుటుంబసభ్యులు క్లిన్ కారా పుట్టినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఇక క్లిన్ కారాకు మెగాభిమానులతోపాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతంలో చరణ్‌తో కొన్ని సినిమాల్లో కలిసి పనిచేసిన స్టార్ హీరోయిన్స్ సైతం క్లిన్ కారాకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వీరిలో కాజల్‌, కియారా అడ్వాణీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.