గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా లైన్ లో ఉంది.ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాపై తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆసక్తికర కామెంట్స్ ను చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఈసినిమా గురించి మాట్లాడుతూ ఆర్సీ 16 సినిమాలో రామ్ చరణ్ తప్పా ఇంకెవరూ నటించలేరు.. బుచ్చి బాబు అద్భుతమైన కథను సిద్దం చేశాడు.. ఈసినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని తెలిపాడు. దీంతో ఇప్పుడు విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో గేమ్ ఛేంజర్ సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: