నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎదురుచూపులకు మరికొద్ది రోజుల్లో బ్రేక్ పడనుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఫ్యాన్స్ ఒక వైపు అప్ డేట్లు లేవని బాధపడుతున్న సమయంలో ఇప్పుడు వరుసగా అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి ఎన్నో పోస్టర్లు, టీజర్, ట్రైలర్, భైరవ యాంథమ్ తో పాటు ఎన్నో స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేశారు. అన్నీ సినిమాకు మంచి హైప్ ను తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా కల్కి వరల్డ్ గురించి నాగ్ అశ్విన్ పలు ఆసక్తిక విషయాలు తెలియచేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల క్రితమే ఒక ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. కలియుగం ఎంటర్ అయ్యాక వచ్చే విష్ణుమూర్తి పదో అవతారం కల్కి. కల్కి అవతారం ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ కథ. ఈ కథ అన్నింటికి క్లైమాక్స్. ఇప్పటివరకు మనం చదివిన పురాణాలు అన్నింటికి ఒక ఎండ్ లాగా ఈ సినిమాను తీశాం. కలి పురుషుడు ఒక్కో యుగంలో ఒక్కో రూపంలో ఉంటాడు అనుకుంటే, అతడిని ఎదుర్కొనే కల్కి పాత్రలో హీరోను చూపిస్తున్నాం అంటూ ఈవీడియోలో తెలిపాడు.
ఇప్పుడు రెండో ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో మూడు ప్రపంచాలను పరిచయం చేశారు. కలియుగం ముగిసిన తరువాత మిగిలిన ఆఖరి నగరంగా కాశీని చూపించాం.. ఇక కాశీ పైన మరో ప్రపంచం కాంప్లెక్స్ కూడా ఉంటుంది. భూమిపై అంతరించిపోయినవన్నీ కాంప్లెక్స్ పై ఉంటాయి. ఇక ఈ సినిమాలో మూడో ప్రపంచం శంబాల కూడా ఉంటుందని.. ఈ మూడు ప్రపంచాలను కలిపే ఒక పాయింట్ తో ఈ సినిమా కథ ముందుకు సాగుతుందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























