
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 93


కాంతార 2 లాంచింగ్ డేట్ ఫిక్స్

జపాన్ లో ఆర్ఆర్ఆర్ అన్ స్టాపబుల్-టాప్ 7

టెర్రిఫిక్ గా పుష్ప2 ఇంటర్వెల్ ట్విస్ట్

OG లో బాలీవుడ్ స్టార్ హీరో

3 భాగాలుగా కెప్టెన్ మిల్లర్?

బన్నీAAA సినిమాస్ ఆదిపురుష్ తో ఓపెన్

కీడా కోలా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

RAPO20 మైసూర్ షెడ్యూల్ కంప్లీట్

ఆదిపురుష్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్

ఆదిపురుష్- ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్

రాముని గా వెండితెరపై అలరించిన హీరోలు

విజయ్, మృణాల్ న్యూ మూవీ గ్రాండ్ లాంచ్

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్, లావణ్య

ఈనగరానికి ఏమైంది? రీ రిలీజ్ డేట్ లాక్

పొన్నియన్ సెల్వన్ 2 హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 28న సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కూడా సాలిడ్…

సూర్య కంగువ- స్పెషల్ డే కి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్?
తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

కాంతార 2 లాంచింగ్ డేట్ ఫిక్స్
ఈమధ్య కన్నడ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నాయి. కె.జి.యఫ్ తరువాత ఆ రేంజ్ లో ఈమధ్య కాలంలో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వంలో చాలా సహజంగా అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈసినిమా తెరకెక్కింది. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయింది కాంతార. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయింది.

జపాన్ లో ఆర్ఆర్ఆర్ అన్ స్టాపబుల్-టాప్ 7
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈసినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తయి ఇంకా ఈసినిమా గురించి మాట్లాడుతుంటున్నామంటేనే అర్థమవుతుంది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న భగవంత్ కేసరి టీజర్
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.

టెర్రిఫిక్ గా పుష్ప2 ఇంటర్వెల్ ట్విస్ట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పుష్ప. ఈసినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్…

OG లో బాలీవుడ్ స్టార్ హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. వీటిలో ఓజీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలుపెట్టగా కొంతవరకూ పూర్తి చేసుకుంది.

3 భాగాలుగా కెప్టెన్ మిల్లర్?
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అన్నీ మంచి శకునములే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా అన్నీ మంచి శకునములే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మే 18వ తేదీన రిలీజ్ అయిన మంచి టాక్ నే సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈసినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 17వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లు కూడా…

బన్నీAAA సినిమాస్ ఆదిపురుష్ తో ఓపెన్
మన హీరోలు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లలో కూడా రాణిస్తున్నారు. హీరోలుగా చేస్తూనే సొంత ప్రొడక్షన్స్, బ్రాండ్ అంబాసిడర్స్, మల్టీ ప్లెక్స్ లు అంటూ ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పటికే మల్టీ ప్లెక్స్ ల రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా మల్టీ ప్లెక్స్ ను నిర్మించాడు. ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

కీడా కోలా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి సక్సెస్ ను కొట్టాడు యంగ్ డైరెక్టర్ తరణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఈసినిమా తరువాత దాదాపు నాలుగేళ్లకు మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తున్నాడు. కీడా కోలా అనే వెరైటీ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ ఇంకా ప్రీ లుక్ పోస్టర్ తోనే ఈసినిమాపై క్యరియాసిటీ పెంచేశాడు తరుణ్.

RAPO20 మైసూర్ షెడ్యూల్ కంప్లీట్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఆదిపురుష్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్
ఇప్పుడు ఎక్కడ చూసిన ఆదిపురుష్ మానియానే కనిపిస్తుంది.మరో కొన్ని గంటల్లో ఆదిపురుష్ థియేటర్లలోకి రానుంది.బుక్ మైషో లో 1మిలియన్ ఇంట్రెస్ట్స్ ను క్రాస్ చేసింది.అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అన్ని థియేటర్లలో దాదాపు టికెట్స్ అన్ని సోల్డ్ అయ్యాయి.రెండో రోజుకూడా బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాకు తిరుగుండదు.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకూడా లేదు.సో ఈజీగా బ్రేక్ ఈవెన్ ను చేరుకుంటుంది.ఇక మొదటి రోజు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.అదే గాని జరిగితే ఓపెనింగ్ విషయంలో ఆదిపురుష్ సరికొత్త రికార్డు ను…

ఆదిపురుష్- ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతీ సనన్ ప్రధాన పాత్రల్లో రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా టికెట్ బుక్సింగ్స్ ను ఓపెన్ గా ఏ రేంజ్ లో బుక్ అవుతున్నాయో చూస్తున్నాం. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. ఇక ఈసినిమా టికెట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణ రాష్ట్రం లో సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయల టికెట్ పెంచుతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇది మొదటి మూడు రోజులకు వర్తించనుందని.. ఉదయం 4 గంటల షో నుండి ఆటలు…

రాముని గా వెండితెరపై అలరించిన హీరోలు
కాలం ఎంత మారుతున్నాా కొన్ని కథలలో నిజం మాత్రం మారదు. ముఖ్యంగా ఇతిహాసాలు మహాభారతం, రామాయణం లాంటి కావ్యాలు మాత్రం ఎప్పటికీ అలానే నిలిచిపోయేవి. తరాలు మారినా కూడా మార్చడానికి వీలులేని స్పూర్తి కలిగించే కావ్యాలు అవి. పూర్వికులు విన్నారు.. మనం వింటున్నాం.. భవిష్యత్తు తరాలవారు కూడా వింటారు. ఇక రామాయణం మీద ఇప్పటికే వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ ఒకటే అయినా దానికి ఆవిష్కరించే వారి పద్దతి ఒక్కోరకంగా ఉంటుంది. త్వరలో ఇదే కథతో ప్రభాస్ ఆదిపురుష్ తో రాబోతున్నాడు. ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇంకా రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వెండితెరపై…

బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ ను కొట్టి తెలుగులో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో రాగా.. బిచ్చగాడు 2 సినిమా చెల్లి సెంటిమెంట్ వచ్చింది. ఇక ఈసినిమా . సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో ఈసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది.

శ్రీ లీల బర్త్ డే- ఫస్ట్ లుక్ పోస్టర్ల సందడి
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉంది. రామ్ పోతినేని, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో, బాలకృష్ణ సినిమాలో ఇంకా విజయ్ దేవరకొండతో ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.

విజయ్, మృణాల్ న్యూ మూవీ గ్రాండ్ లాంచ్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు ఈమధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. అయనా కూడా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుండటంతో ఇంకా క్రేజ్ పెరిగింది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఈసినిమా నుండి నా రోజా నువ్వే అనే పాటను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్…

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్, లావణ్య
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్ మెంట్ ఈనెల 9వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి మధ్య ప్రేమాయణం దాదాపు ఏడేళ్ల పాటు సాగినా కూడా ఇంతకాలం చాలా గోప్యంగా ఉంచారు. లావణ్య అయినా కనీసం ఒకటి రెండు సార్లు రియాక్ట్ అయింది కానీ వరుణ్ తేజ్ మాత్రం ఎప్పుడూ వీరిద్దరి మీద వచ్చిన వార్తలపై స్పందించలేదు. పైనల్లీ ఇన్నేళ్ల తరువాత ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్ మెంట్ తో తమ ప్రేమను బయట పెట్టారు. కేవలం కుటుంబసభ్యుల మధ్య వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక వివాహం అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్టు అది కూడా వచ్చే ఏడాది జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈనగరానికి ఏమైంది? రీ రిలీజ్ డేట్ లాక్
తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్,అభినవ్ గోమఠం,సాయి సుశాంత్ రెడ్డి,వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ నగరానికి ఏమైంది?.సిమ్రాన్ చౌదరి,అనీషా అంబ్రోస్ కీలక పాత్రల్లో కనిపించారు.స్నేహం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈసినిమా 2018లో విడుదలైయి మిక్సడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది అయితే థియేటర్లలో అనుకన్నతంగా సక్సెస్ కాలేదు కానీ ఓటిటి,టీవీ ల్లో చూసి ఈసినిమాకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.ఇక ఈసినిమా ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది.