సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పుష్ప. ఈసినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మారేడుమిల్లి, వైజాగ్, హైద్రాబాద్ లో ఈసినిమా మేజర్ పోర్షన్స్ ను కంప్లీట్ చేశారు. ఇక మరోవైపు ఈసినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా కోసం సుకుమార్ టెర్రిఫిక్ ఇంట్రర్వెల్ ట్విస్ట్ ను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ ట్విస్ట్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక పాత్రకు సంబంధించి ఉంటుందని. ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాలో ఒక హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. చూద్దాం మరి సుకుమార్ ఏం ప్లాన్ చేశాడో..
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: