కీడా కోలా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

tarun bhaskar keeda cola movie teaser release date fixed

పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి సక్సెస్ ను కొట్టాడు యంగ్ డైరెక్టర్ తరణ్ భాస్కర్. మొద‌టి సినిమాతోనే నేష‌నల్ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌ను తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ విజ‌యాన్ని అందుకున్నాడు. ఈసినిమా తరువాత దాదాపు నాలుగేళ్లకు మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తున్నాడు. కీడా కోలా అనే వెరైటీ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ ఇంకా ప్రీ లుక్ పోస్టర్ తోనే ఈసినిమాపై క్యరియాసిటీ పెంచేశాడు తరుణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ రీలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 29వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఇదే రోజు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ ఈ నగరానికి ఏమైంది సినిమా రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా రిలీజ్ అయి 5 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరోసారి ఈసినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజున కీడా కోలా మూవీ టీజర్‌ను విడుదల చేయననున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో కామెడీ కింగ్, సీనియర్ యాక్టర్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా మొత్తంగా 8 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాది రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nineteen =