విజయ్, మృణాల్ న్యూ మూవీ గ్రాండ్ లాంచ్

vijay devarakonda 13th movie grand launch

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు ఈమధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. అయనా కూడా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుండటంతో ఇంకా క్రేజ్ పెరిగింది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఈసినిమా నుండి నా రోజా నువ్వే అనే పాటను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈసినిమా రాబోతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గీతా గోవిందం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ఇక నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ లో ఈసినిమా లాంచ్ అవ్వగా.. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా గోవర్ధన రావు దేవరకొండ ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేశారు అలాగే సత్తి రంగయ్య కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.