తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటివరకూ ఈసినిమా టైటిల్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. జూలై లో సూర్య పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆరోజునే ఫస్ట్ లుక్ ను అలానే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలయాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే పుట్టినరోజు నాడు మాత్రం ఫ్యాన్స్ కు ఏదో ఒక ట్రీట్ ఉంటుందంటున్నారు.
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: