ప్రస్తుతం దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతీ సనన్ ప్రధాన పాత్రల్లో రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా టికెట్ బుక్సింగ్స్ ను ఓపెన్ గా ఏ రేంజ్ లో బుక్ అవుతున్నాయో చూస్తున్నాం. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. ఇక ఈసినిమా టికెట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణ రాష్ట్రం లో సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయల టికెట్ పెంచుతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇది మొదటి మూడు రోజులకు వర్తించనుందని.. ఉదయం 4 గంటల షో నుండి ఆటలు ప్రారంభం కానున్నాయని ప్రకటన చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా మేకర్స్ కు శుభవార్తను ప్రకటించింది. ఆదిపురుష్ టికెట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి థియేటర్లలో 50 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. పదిరోజులు రేట్లు పెంచుకునే అవకాశం కలిగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో ఇందులో శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్.. జానకీ దేవిగా కృతి సనన్ నటించారు. అలాగే లంకేశ్వరుడు రావణుడుగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: