కాంతార 2 లాంచింగ్ డేట్ ఫిక్స్

kantara 2 movie launch date fixed

ఈమధ్య కన్నడ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నాయి. కె.జి.యఫ్ తరువాత ఆ రేంజ్ లో ఈమధ్య కాలంలో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వంలో చాలా సహజంగా అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్‌, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈసినిమా తెరకెక్కింది. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయింది కాంతార. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. అంతేకాదు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ ను కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్టు కూడా తెలిపారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా లాంచింగ్ డేట్ ను ఫిక్స్ చేశారట. ఆగష్ట్ 27వ తేదీన ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాలి.

కాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =