టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్ మెంట్ ఈనెల 9వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి మధ్య ప్రేమాయణం దాదాపు ఏడేళ్ల పాటు సాగినా కూడా ఇంతకాలం చాలా గోప్యంగా ఉంచారు. లావణ్య అయినా కనీసం ఒకటి రెండు సార్లు రియాక్ట్ అయింది కానీ వరుణ్ తేజ్ మాత్రం ఎప్పుడూ వీరిద్దరి మీద వచ్చిన వార్తలపై స్పందించలేదు. పైనల్లీ ఇన్నేళ్ల తరువాత ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్ మెంట్ తో తమ ప్రేమను బయట పెట్టారు. కేవలం కుటుంబసభ్యుల మధ్య వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక వివాహం అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్టు అది కూడా వచ్చే ఏడాది జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఎంగేజ్ మెంట్ తరువాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో వరుణ్ తేజ్ స్పందిస్తూ… హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు వెకేషన్ లో ఉన్న ఫొటోను కూడా పంచుకున్నాడు. క్యూట్ గా ఉన్న ఈ పిక్ ఇప్పుడు అందరినీ అకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈసినిమా ఆగష్ట్ 25వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: