బన్నీAAA సినిమాస్ ఆదిపురుష్ తో ఓపెన్

allu arjuns aaa cinemas to make debut with prabhas adipurush telugu movie

మన హీరోలు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లలో కూడా రాణిస్తున్నారు. హీరోలుగా చేస్తూనే సొంత ప్రొడక్షన్స్, బ్రాండ్ అంబాసిడర్స్, మల్టీ ప్లెక్స్ లు అంటూ ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పటికే మల్టీ ప్లెక్స్ ల రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా మల్టీ ప్లెక్స్ ను నిర్మించాడు. ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న బన్నీ ఇప్పుడు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. హైద్రాబాద్ లో AAA సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసి దానిని తాజాగా ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అల్లు అర్జున్ ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అరవింద్, మనవడు అల్లు అయాన్ తదితరులు పాల్గొన్నారు. హైద్రాబాద్ అమీర్ పేట్ లో సత్యం థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అక్కడ ఏషియన్ సత్యం మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన ఈ మాల్‌లో AAA సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. AAA అంటే ఏషియన్ అల్లు అర్జున్ సినిమా.. షార్ట్‌కట్‌లో AAA సినిమాస్ అని దీనికి పేరు పెట్టారు. ఈ AAA సినిమాస్‌లో సునీల్ నారంగ్, అల్లు అర్జున్ భాగస్వాములు. అధునాతన సాంకేతిక వసతులతో దక్షిణాదిలోనే అతి పెద్ద థియేటర్ గా ఈ AAA సినిమాస్ నిర్మించినట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాను ఎపిక్ ఆదిపురుష్ సినిమాతో ప్రారంభించనున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందించింది. ఇక మొదటిపార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =