ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. షూటింగ్ అయితే దాదాపు చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే మైసూర్ లో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు అక్కడ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని బోయపాటి శ్రీను కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. మైసూర్ షెడ్యూల్ పూర్తయింది.. ఈ షెడ్యూల్ మెమరబుల్ గా చేసిన కాస్ట్ అండ్ క్రూ కి థ్యాంక్స్ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: