మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.ఇందులో తన 11వ చిత్రాన్ని చైతన్య కృష్ణ డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.ఇక ఈసినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఈరోజు అంజలి బర్త్ డే సందర్భంగా సినిమానుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అంజలి పాత్ర మాస్ గా వుండనుందని తెలుస్తుంది.ఇందులో అంజలి పాత్ర పేరు రత్నమాల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా సహజనటి అంజలి కి పుట్టినరోజు శుభాకాంక్షలు! 🤩
Introducing @yoursanjali as RATHNAMALA 💥 from #VS11 🔥#HBDAnjali ✨@VishwakSenActor @thisisysr #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/eLxPT2oBOt
— Sithara Entertainments (@SitharaEnts) June 16, 2023
ఇక ఈసినిమానుండి రీసెంట్ గా విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.ఈసినిమాలో విశ్వక్ రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నాడు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా నాగ వంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈఏడాది చివర్లో ఈసినిమా విడుదలకానుంది.
ఇక ఈ సినిమాతోపాటు విశ్వక్ సేన్ మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.రవితేజ డైరెక్షన్ లో తన 10వ చిత్రాన్ని చేస్తున్నాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్నాడు.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈసినిమానుండి కూడా అప్డేట్స్ రానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: