ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డు సృష్టించిన ఆదిపురుష్

adipurush creates new record in rtc cross roads

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతూ ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపిస్తుంది.పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈసినిమా తెలుగుతో పాటు హిందీలో ఎక్స్ట్రార్డినరీ వసూళ్లను రాబడుతుంది.ఇక ఈసినిమా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.ఆదివారం అక్కడ ఆదిపురుష్ 34లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి సినిమా కాకుండా మూడో రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఆదిపురుష్ రికార్డు క్రీయేట్ చేసింది.ఈజాబితాలో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో వుంది.ఆర్ఆర్ఆర్ మూడో రోజు అక్కడ 66లక్షల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.మూడు రోజుల్లో కలిపి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆదిపురుష్ 85లక్షల గ్రాస్ ను వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా చూసుకుంటే అన్ని భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 340కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటింది.అయితే ఈరోజు నుండి ఈసినిమాకు అసలైన పరీక్ష ఎదురుకానుంది.బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం ఇంకో 200కోట్ల వసూళ్లను రాబట్టాల్సివుంది.మరి ఈ రోజు నుండి ఈసినిమా ఎలా ఫర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + nine =