సత్యభామ గా వస్తున్న కాజల్

kajal aggarwal 60th movie title and glimpse out

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తరువాత చందమామ సినిమాతో హిట్ అందుకొని ఆతరువాత కెరీర్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్ . తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ప్రస్తుతం అయితే కాజల్ పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే కోస్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కాస్త నిరాశనే మిగిల్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉంది కాజల్. తెలుగులో బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే భగవంత్ కేసరి నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

వీటితో పాటు ఇప్పుడు మరోో కొత్త సినిమాతో వచ్చేస్తుంది కాజల్. కాజల్ కెరీర్ లో వస్తున్న 60 వ సినిమా ఇది. ఆయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. ఇక కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఇంకా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు సత్యభామ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. ఇక గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సెల్ లో ఉన్న ఓ నిందితుడు ఎంత కొట్టినా నోరు మెదపకపోవడంతో చీర, చేతి గాజులతో వచ్చిన కాజల్ కొట్టిన దెబ్బలకు నిజం చెప్పేసే సీన్ ఆసక్తికరంగా ఉంది.

కాగా అఖిల్ డేగల ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబి తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.