సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ రిలీజ్

Sudheer Babu Movie Title Poster As Maa Nanna Superhero

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్‌ సినిమా రిలీజ్ అవ్వగా అది సరైన విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా హరోంహర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాను ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుమంత్‌ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు సుధీర్ బాబు. అభిలాష్‌ కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాకు మా నాన్న సూపర్ హీరో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలు లాటరీని ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్స్‌ను పెట్టారు. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కామ్ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌ తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =