మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కెరీర్ మొదటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఈసినిమా షూట్ మొత్తం విదేశాల్లోనే జరుపుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేడ్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు తన పుట్టినరోజు కావడంతో ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సాక్షి వైద్య ఇంకా వరుణ్ తేజ్ ఉన్న ఈ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో ఇంకా విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: