టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా కూడా విజయ్ కు క్రేజ్ తగ్గలేదు. వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక దీనితో పాటు ఇప్పుడు వేరే సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతానికి 12 అనే వర్కింగ్ టైటిల్ తోనే తెరకెక్కుతుంది. ఈసినిమాను నుండి ఇప్పటికే ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు పలు కామెంట్లు వచ్చాయి. అయితే వాటికి నిర్మాత నాగవంశీ అప్పుడే క్లారిటీ ఇచ్చాడనుకోండి. ఇక ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ఎప్పుడో ప్రారంభించారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
A spectacular journey of #VD12 commences Today! 🔥#VD12ShootBegins 💥 @TheDeverakonda @anirudhofficial @sreeleela14 @gowtam19 @vamsi84 #SaiSoujanya @NavinNooli #GirishGangadharan @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/CpJXo1Zo2h
— Sithara Entertainments (@SitharaEnts) June 16, 2023
కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























