చివరి దశలో విజయ్ లియో

vijay and lokesh kanagaraj LEO movie shoot nearing completion

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు. ఇక విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న నా రెడీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండీ ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను జరుపుతూ వస్తున్నారు మేకర్స్. దీంతో ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తచేసుకున్నట్టు సమాచారం. ఇక ఈనెల చివరి లోపు మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారట మేకర్స్.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈసినిమా తమిళ్ తోపాటు ఇతర భాషల్లో అక్టోబర్ 19న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =