టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్ . తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ప్రస్తుతం అయితే కాజల్ పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే కోస్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కాస్త నిరాశనే మిగిల్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉంది కాజల్. తెలుగులో బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. వీటితో పాటు ఇప్పుడు మరోో కొత్త సినిమాతో వచ్చేస్తుంది. తాజాగా కాజల్ 60వ సినిమాకు సబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి పోస్టర్ ను రిలీజ్ చేస్తూ టైటిల్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కారు విండోలో నుంచి చేయి బయటకు పెట్టి .. సైడ్ మిర్రర్ లో ఆమె ఫేస్ ను చూపిస్తూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈసినిమాకు సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియచేయలేదు మేకర్స్. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తుండగా దీనిని తెరకెక్కిస్తున్న దర్శకుడు మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి తెలియాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: