యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు.తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే. ఈగ,బాహుబలి,ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్, దేవరకు కూడా ఫైట్స్ కంపోజ్ చేయనున్నాడు.రాబోయే షెడ్యూల్ లో సోలమాన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో చిత్ర బృందం చాలా హ్యాపీ గా ఉందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ డైరెక్టన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న తెలుగుతోపాటు హిందీ,తమిళ ,కన్నడ,మళయాళ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: