దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుంది. ఈనేపథ్యంలో హైద్రాబాద్ లోని రియలిస్టిక్ లొకేషన్స్ లో చిత్రయూనిట్ షూట్ చేస్తుంది.. ఇవానా, అశిష్ రెడ్డి మధ్య పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అంటూ మేకర్స్ పలు ఫొటోలు సైతం షేర్ చేశారు.
From bustling markets to bare streets💥
Team #SELFISH is capturing the essence of Hyderabad’s realistic locations, as the shoot is going on at a rapid pace with some key scenes being shot on @AshishVoffl @i__ivana_❤️🔥#KasiVishal @MickeyJMeyer @SVC_official @SukumarWritings pic.twitter.com/uO3mkbt9LG
— Sri Venkateswara Creations (@SVC_official) July 18, 2023
కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమామాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: