రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తనకున్న అనారోగ్య కారణాల వల్ల ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకోనుంది. ఇప్పుడు మరో హీరో కూడా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నాడు. ఆహీరో ఎవరో కాదు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని తన సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రీసెంట్ గానే విరూపాక్ష సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అంతేకాదు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అయితే ఈసారి పవర్ స్టార్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమయ్యారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయితేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా జులై 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తేజ్ ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది.. షూటింగ్ ఎలా జరిగింది లాంటి విషయాలను పంచుకున్నారు. అంతేకాదు తన ఆరోగ్యం గురించి కూడా తెలియని విషయాలు తెలియచేశారు. తనకు ఫిజికల్ గా ఇంకా ఇబ్బందులు ఉన్నాయని.. యాక్సిడెంట్ తరువాత 12రోజులు కోమాలో ఉన్నాను అప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కించారు.. దాంతోో ఆ తరువాత వెయిట్ గెయిన్ అయ్యాను.. ఇప్పుడిప్పడే కోలుకుంటున్నా.. ఇంకా పూర్తిగా సెట్ అవ్వాలని తెలిపాడు. అంతేకాదు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సంపత్ నందితో ఉందని.. అయితే బ్రో రిలీజ్ తరువాత ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాలని.. నేను పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి 3 నుండి 6 నెలల టైమ్ పడుతుందని.. ఆతరువాత షూటింగ్ మొదలుపెడతానని తెలిపాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: