వారసుడు తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం లియో.రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.కేవలం 120రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాఫై తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.దాంతో ఈసినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.ఈహక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.విజిల్,మాస్టర్,వారసుడు సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ను ఏర్పచుకున్నాడు విజయ్.దానికి తోడు గత ఏడాది విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి లోకేష్ కనగరాజ్ సూపర్ ఫామ్ లో ఉండడంతో లియోకి ఎంతైనా పెట్టడానికి వెనుకాడలేదు సితార నిర్మాతలు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్,ప్రియా ఆనంద్,గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.7స్క్రీన్స్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ 19న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: